![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1060 లో.. వెంకీ సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తాడు. ఫుడ్ డెలివరీ లేట్ అవుతుందని ఓనర్ కి కస్టమర్స్ ఫోన్ చేస్తారు. దాంతో ఓనర్ కోపంగా వెంకీకి ఫోన్ చేసి ఇంకా ఫుడ్ డెలివరీ చెయ్యలేదంట ఎందుకని అని కోప్పడతాడు. చేస్తున్నా సర్ అని వెంకీ అంటాడు. ఆ తర్వాత వెంకీ సైకిల్ పై ఫుడ్ ఆర్డర్ చెయ్యడం కస్టమర్ చూసి ఏంటి మీ డెలివరీ బాయ్ సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని చెప్తాడు.
ఇలా అయితే ఎలా రోజు ఫుడ్ కోసం ఇలా వెయిట్ చెయ్యడం మా వల్ల కాదని అతను ఓనర్ తో అంటాడు. అలా అనగానే మళ్ళీ వెంకీకి ఓనర్ ఫోన్ చేసి.. నువ్వు సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తున్నావంట. ఇలా అయితే ఎలా అర్జెంట్ గా నువ్వు నా దగ్గరికిరా అని కోప్పడతాడు. మరొకవైపు ఇందు ప్లాన్ లో భాగంగా అపర్ణ ఫ్రెండ్ శకుంతల ఇంటికి వస్తుంది. ఎవరి దిష్టి తగిలిందో ఏమో మీ కుటుంబం ఇలా అయిందని తను అంటుంది. ఇందు నువ్వు ఇప్పుడు సీఈఓ కదా.. కూర్చొని భోజనం చెయ్ అని రాజు అనగానే ఏంటి మన ఇందు సీఈఓనా అని శకుంతల అంటుంది. నిన్ను కనీసం మనిషిగా కూడా చూడదు అలాంటిది.. ఆ రేఖ సీఈఓ చేసిందా అని శకుంతల అంటుంది. ఏంటి ఆంటీ మా రేఖ ఆంటీ గురించి అలా మాట్లాడకండి తను మంచిది అని ఇందు అంటుంది. నిన్ను అసలు ఇంట్లో నుంచి బయటకే పంపలేదు తను మంచిది ఏంటని శకుంతల అనగానే ప్లీజ్ ఆంటీ.. మీరు మా రేఖ ఆంటీ గురించి అలా మాట్లాడకండి.. మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని ఇందు అనగానే శకుంతల వెళ్ళిపోతుంది. ఏంటి ఇందు నా ఫ్రెండ్ తో అలాగేనా మాట్లాడేది అని అపర్ణ అంటుంది. తన నోరు మూయించావ్ మరి బయట జనాలు కూడా అలాగే అనుకుంటున్నారని సుభాష్ అనగానే వాళ్ళ నోరు కూడా మూయిస్తానని ఇందు అంటుంది. ఆ తర్వాత రేఖ దగ్గరికి ఇందు వెళ్తుంది. రేఖ ఆంటీ ఇప్పుడు నేను సీఈఓ కదా.. నేను సీఈఓ అయినందుకు పార్టీ చేద్దాం.. అప్పుడు మన క్లయింట్స్ అందరు వస్తారు. అందరిలో మీరు నన్ను బాగా చూసుకోవడం లేదన్న అపోహ పోతుందని ఇందు అనగానే రేఖ సరే అంటుంది.
ఆ తర్వాత వెంకీ ఓనర్ దగ్గరికి వస్తాడు. నువ్వు ఇలా సైకిల్ పై డెలివరీ చేస్తే నా బిజినెస్ దెబ్బ తింటుంది. నీకు జాబ్ లేదని ఓనర్ అనగానే వెంకీ ఒక ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో అతను సరే అంటాడు. మరొకవైపు పార్టీ ఎలా చెయ్యాలని ఇందు, రాజు ఆలోచిస్తారు. తరువాయి భాగంలో రాజు, లక్కీ డ్రింక్ చేస్తుంటారు. ఇందు నేను భార్యాభర్తలం కాదు అద్దె మొగుడిగా యాక్టింగ్ చేస్తున్నానని రాజు అనగానే అవన్నీ ఐశ్వర్య వింటుంది. ఇక రేపు జరగబోయే పార్టీలో ఈ విషయం అందరికి తెలిసేలా చేస్తానని ఐశ్వర్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |